Site icon NTV Telugu

బీజేపీ ప్రభుత్వ అకృత్యాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది: కొప్పుల ఈశ్వర్‌

బీజేపీ ప్రభుత్వ అకృత్యాల పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను అమ్మేయాలనే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టులా సింగరేణి సంస్థను అమ్మేసే ప్రయత్నం చేస్తుందన్నారు. లాభాల్లో నడిచే సంస్థలను ప్రవేట్‌ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త బ్లాకులు తవ్వుకోవడాని పర్మిషన్ ఇవ్వకపోగా..ఉన్న బ్లాకులను ప్రైవేటు పరం చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ,రవాణా రంగంలో సింగరేణి గణనీయమైన వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. కార్మిక, పారిశ్రామిక వ్యతిరేక విధానాలను ఎండగడతామని కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పోరాడాలని మంత్రి సూచించారు.

https://ntvtelugu.com/minister-harish-rao-wrote-a-letter-to-union-minister-nirmala-sitharaman/

సింగరేణి సంస్థను బొందపెట్టాలని కేంద్రం చూస్తోంది: బాల్క సుమన్‌
సింగరేణి ని బొంద పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని బాల్క సుమన్‌ ఆరోపించారు. సింగరేని కార్మికుల తరపున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. సింగరేణిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని పలు మార్లు సీఎం కేసీఆర్‌ ప్రధాన మంత్రికి లేఖ రాసిన స్పందన లేదన్నారు. మోడీ దోస్త్ లకు సింగరేణి సంస్థను అప్పగించే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. సింగరేణి ప్రైవేటు పరం అయితే వారసత్వ ఉద్యోగాలు కొనసాగిస్తారా..? అంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రాంతంలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? టీఆర్ఎస్‌ను తిట్టడం తప్ప బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అంటూ విమర్శించారు. బీజేపీ నేతల పై సింగరేణి కార్మికులు తిరగబడాలి, నిలదీయాలిన్నారు. పార్లమెంట్‌ సమవేశాల సందర్భంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని బాల్క సుమన్‌ పేర్కొన్నారు.

Exit mobile version