Site icon NTV Telugu

Koppula Eshwar: అడ్లూరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.. మంత్రి హెచ్చరిక

Koppula Eshwar

Koppula Eshwar

Koppula Eshwar Warns Adduri Lakshman Kumar: 30 ఏళ్ల ప్రజా జీవితంలో తాను మచ్చలేని జీవితాన్ని గడిపానని.. ఎన్నికల రీకౌంటింగ్ గురించి అడ్లూరి లక్ష్మణ్ తనపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అనంతరం అడ్లూరిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ రాష్ట్రా, కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో జరుగుతుందన్నారు. ఎలక్షన్ కమిషన్ పూర్తి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని పేర్కొన్నారు. ధర్మపురి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తనపై ఎన్నో ఆరోపణలు చేశారన్నారు.

Kottu Satyanarayana: పవన్‌ని చూస్తుంటే జాలేస్తోంది.. విషయం అర్థమైపోయినట్టుంది..!

ఐఏ పిటిషన్‌లు వేసి, తీర్పు రాకుండా.. కేసును లక్ష్మణ్ కాలయాపన చేస్తున్నారని మంత్రి కొప్పుల చెప్పుకొచ్చారు. నిబంధనల ప్రకారమే.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు EVMలను ధర్మపురి కాలేజ్‌లో భద్రపరచారన్నారు. లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది బూతుల్లో ఎలాంటి ఓట్ల తేడాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలకు సంబందించి.. ఎక్కడైనా సరే చర్చించుకందామని లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు. ఎన్నికకు సంబందించిన సీసీ కెమెరా ఒరిజినల్ ఫుటేజ్ లక్ష్మణ్ దగ్గరే ఉందని.. దాన్ని కోర్టులో సమర్పించి, చిత్తశుద్ధి చాటుకో అని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు నా చేతిలో ఉన్నాయని లక్ష్మణ్ అనడం విడ్డూరమని అన్నారు. ప్రజాస్వామ్యంపై, న్యాయవ్యవస్థపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. తీర్పు త్వరగా వచ్చేలా వ్యవహరించాలని లక్ష్మణ్‌కి చెప్పారు.

MLC Jeevan Reddy: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోంది

కాగా.. 2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పోటీ చేయగా.. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో దిగారు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ పోరులో.. 441 ఓట్ల మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. అయితే.. కొప్పుల ఈశ్వర్ గెలుపు కోపం అడ్డదారులు తొక్కారని లక్ష్మణ్ ఆరోపించారు. హైకోర్టుని కూడా ఆశ్రయించారు. లక్ష్మణ్ పిటిషన్‌ను తిరస్కరించాలంటూ.. మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. హైకోర్టు దీన్ని 2022 జూన్ 28వ తారీఖున కొట్టివేసింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

Exit mobile version