Koppula Eshwar: బహిరంగ చర్చకు వాళ్ళు మేము కలవడం ఎలా కుదురుతుందని, ఎక్కడి వాళ్ళని అక్కడే ఆపేస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా బిర్పూర్ మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టునుమంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత ఉన్నారు. రోళ్ల వాగు సందర్శన అనంతరం మాట్లాడుతూ.. బహిరంగ చర్చకు వాళ్ళు మేము కలవడం ఎలా కుదురుతుంది. ఎక్కడి వాళ్ళని అక్కడే ఆపేస్తారని అన్నారు. ఇవాళ మేము రోళ్ల వాగు సందర్శించి మాట్లాడాము. రేపు వాళ్ళను కూడా ఇదే అంశంలో మాట్లాడమని చెప్పండి. మేము ఎందుకు వద్దు అంటామని తెలిపారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు కట్టలేదని గుర్తు చేశారు.
కళ్ళముందే గోదావరి నీళ్లు వృధాగా పోతుంటే కనీసం ఆపే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. తాగునీరు ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. మా ప్రభుత్వంలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరుస్తున్నామని గుర్తు చేశారు. చెరువులన్నింటినీ నింపామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటల కరెంట్ ఇస్తున్నామని అన్నారు. రైతులకు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇవాళ పుష్కలమైన పంటలు పండుతున్నాయని అన్నారు. ఇవన్నీ మీ హయాంలో ఎందుకు చేయలేకపోయారని అన్నారు. ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి ఎలా అయినా మాట్లాడస్తది కదా అని రైతులను గంధరగోలానికి గురిచేసేలా అబద్దాలు ప్రచారాలు చేయడం పద్ధతి కాదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు అని మాట్లాడుతున్నారు. వచ్చే వారం రోజుల్లో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సమాచారం ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.
ఇక తాజాగా.. జీవన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో జీవన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు ఎక్కడ చర్చించాలో చెప్పండి, అక్కడ చర్చిద్దాం, ఏం చర్చించాలో చెప్పండి అని సవాల్ విసిరారు. ధర్మపురి నియోజకవర్గ రైతులను 3 టీఎంసీ పేరుతో మోసం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే రైతుల నోటికి దుమ్మెత్తి పోశారని విమర్శించారు. 3 టీఎంసీల భూసేకరణలో ఎకరం 40 లక్షలు విలువ చేస్తే 10 లక్షలు ఇచ్చారని కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ముందు రోళ్ల వాగు చరిత్ర తెలుసా? కొప్పుల క్యాంపు కార్యాలయం ఎదుట వరి ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు వరిసాగు చేసిన ఘటన మరిచిపోయిందని ఈశ్వర్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Bopparaju Venkateswarlu: ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు