మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తర్జన భర్జన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇదే ఊపులో మరిన్ని చేరికలు బీజేపీ తెరలేపుతోంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించారు. అయితే, ఆయన బీజేపీ గూటికి చేరడం ఖాయమనే ప్రచారం అప్పటినుంచి జరుగుతూనే ఉంది. ఇక, ఇవాళ బీజేపీ నేత డీకే అరుణతో సమావేశమయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. పార్టీలో చేరిక పై చర్చించినట్టు సమాచారం.. ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ సూచించినట్టుగా చెబుతున్నారు.. దీనికి విశ్వేశ్వర్‌రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారని టాక్ నడుస్తోంది.. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. త్వరలోనే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. పరిణామాలు చూస్తుంటే.. ఆయన బీజేపీలో చేరతారని చెబుతున్నారు.. ఈటల రాజేందర్.. బీజేపీలో చేరడానికి కొండా రాయబారం కూడా నడిపారమే ప్రచారం కూడా జరిగింది.
ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి వంతు..! త్వరలో బీజేపీలోకి..!
konda vishweshwar reddy