NTV Telugu Site icon

Konda Surekha vs Harish Rao: కేంద్రాన్ని దూరం పెట్టిందే బీఆర్‌ఎస్‌ పార్టీ.. కొండ సురేఖ ఫైర్

Konda Surekha

Konda Surekha

Konda Surekha vs Harish Rao: బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ పోటా పోటీ మాటలతో శాసనసభ హీటెక్కింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. నీటి తీరువా వసూలు చేసింది కాంగ్రెస్.. తీరువా ఎత్తేసిన చరిత్ర మాదని హరీష్ రావు తెలపడంతో.. కొండాసురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారని మండిపడ్డారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిరుపేదలెవరికీ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు వాళ్ల కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని అన్నారు. కృష్ణా జలాలను పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారని తెలిపారు. జగన్‌, కేసీఆర్‌ బయట తిట్టుకుంటారు, లోపల మాట్లాడుకుంటారని మండిపడ్డారు.

Read also: Uttam Kumar vs Harish Rao: బోరు బావి వద్ద మీటర్ల పై ఉత్తమ్‌ వర్సెస్‌ హరీష్ రావు

కేంద్రాన్ని దూరం పెట్టింది బీఆర్‌ఎస్‌ పార్టీనే అన్నారు. కేంద్రంతో వైరం పెట్టుకుని నిధులు తెచ్చుకోలేని పరిస్థితి తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి భవనాలు కట్టారు అంటున్నారు.. వరంగల్ జైల్ కూలగొట్టి ఏం చేశారు? అని ప్రశ్నించారు. పాత సెక్రటేరియట్ కులగొట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అని ఎమ్మెల్యే హరీష్ రావుకు.. ఎక్సైజ్ పర్యాటకశాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావు సభను తప్పు దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మేధా శక్తిని ఉపయోగించి మాట్లాడిన…వాస్తవాలు వాస్తవాలే అన్నారు. కార్పోరేషన్ ద్వారా అప్పులు తెచ్చాం అంటున్నారని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నప్పుడు.. ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడం లేదా..? అని ప్రశ్నించారు. సభను తప్పు దోవ పట్టిస్తున్నారని హరీష్ రావ్ అన్నారు.

Read also: Mumbai Indians: ఆందోళన వద్దు.. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ చేస్తాడు!

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులు…ప్రగతి భవన్ పై దుష్ప్రచారం చేశారని అన్నారు. ప్రగతిభన్ లో 150 గజాలు ఉన్నాయి అని…బుల్లెట్ ప్రూఫ్ గదులు ఉన్నాయి అని కాంగ్రెస్ అందన్నారు. భట్టి విక్రమార్క ప్రగతి భవన్ లో ఉంటున్నారని అన్నారు. భట్టి విక్రమార్క చెప్పాలి…ప్రగతి భవన్ లో ఏమి ఉన్నాయో ? ఎన్ని గదులు ఉన్నాయో? అన్నారు. ప్రాజెక్ట్ ల పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్న అని తెలిపారు. మేము రెడీగా ఉన్నాము… ఎటువంటి విచారణకు అయిన సిద్ధం అన్నారు. ప్రాజెక్ట్ లపై కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని దురదృష్టవశాత్తు ప్రజలు నమ్మారని తెలిపారు.
Ravinder Singh: స్మార్ట్ సిటీ పనులు కేవలం 50 డివిజన్లలో మాత్రమే చేపట్టాలి..