సిఎం కెసిఆర్ కు కోమటిరెడ్డి బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఘట్‌కేసర్-రాయిగిరి (యాదాద్రి) విస్తరణకు రైల్వే మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని… పలుమార్లు కేంద్ర మంత్రులను, రైల్వే అధికారులను కలిసి విన్నవించినందుకు ఆమోదం రావడం సంతోషంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదగిరిగుట్టకు రాష్ట్ర రాజధాని నుంచి రవాణా సౌకర్యం చాలా సులభం అవుతుందని… అలాగే భక్తుల తాకిడి సైతం పెరుగుతుందని తెలిపారు. ఇటు భక్తులకు సౌకర్యం, అటు యాదాద్రి అభివృద్ది కావాలంటే ఈ ప్రాజెక్టు చాలా అవశ్యకమని… అయితే ఈ ప్రాజెక్టు మొదలు కావాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కార్ భరించాల్సిన వ్యయాన్ని వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించేందుకు రైల్వే శాఖకు సహకరించాలని లేఖలో కోరారు. ఈ ప్రాజెక్టు సాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ 1:2 నిష్పత్తిలో వ్యయం భరించాల్సి ఉంటుందని… యాదాద్రి అభివృద్దికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టు మొదలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ. 75 కోట్లను రైల్వే శాఖకు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!