Komatireddy Venkat Reddy : యాదాద్రిలో భక్తులను ఇబ్బంది పెట్టొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు భారీగా కాంగ్రెస్ శ్రేణుల తరలివచ్చారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ఆయన ఆరోపించారు. రైతు పండించిన పంటను కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేస్తున్నాయని, యాదాద్రి ఆలయ ప్రారంభానికి నన్ను పిలవలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారమే ఆలయ ఉద్ఘాటనకు పిలవలేదని, మౌలిక సదుపాయాలు లేకున్నా ఆలయాన్ని ప్రారంభించారని ఆయన ఆరోపించారు. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఆలయాన్ని ప్రారంభించి భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదని, యాదాద్రిలో ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టొద్దని ఆయన ‘స్పష్టం చేశారు.
ప్రజల సొమ్ముతో ఆలయాన్ని నిర్మించి టీఆర్ఎస్ లీడర్లకే సొంతమన్నట్లు ప్రజలపై ఆంక్షలు పెట్టొద్దని, ఆలయ నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయని, వెంటనే ఆటోలను కొండపైకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రికి 22 సార్లు వచ్చిన సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లయినా కట్టించారా.?అని ఆయన ప్రశ్నించారు. ఆలయ ప్రారంభాన్ని తూతూ మంత్రంగా చేయడంతో గుట్టలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిందని, భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్లవుతున్నా నయా పైస ఇయ్యలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక భద్రాచలం ఆలయాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని, రూ.200 కోట్లతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. యాదాద్రి అభివృద్ధిలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, గతంలో ఆనంద్ సాయి ఏ టెంపుల్ కు ఆర్కిటెక్చర్ గా పనిచేయలేదని, ఆలేరు నియోజకవర్గ రైతులను ఆదుకోవాలన్నారు.
Also Read
https://ntvtelugu.com/madhu-yashki-goud-about-paddy-procurement/
తాజావార్తలు
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!