komatireddy venkat reddy letter to priyanka gandhi over shabbir ali: నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆలేఖలో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ప్రియాంకా గాంధీని కోరారు. దీనికి గల కారణాలను కూడా ఆయన తన లేఖలో వివరించడం గమనార్హం. లేఖలో ప్రస్తావిస్తూ.. చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి తెలిపారు. దీని కారణంగా షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఇకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని లేఖలో చెప్పుకొచ్చారు. ఇక షబ్బీర్ ను ఇంకా పార్టీలోనే కొనసాగిస్తే ఆయన వల్ల పార్టీకి నష్టం జరగవచ్చని కూడా కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి, ప్రియాంకగాంధీకి రాసిన లేఖ సంచళనంగా మారింది. నిన్న ఆయన లేఖలో ప్రస్తావిస్తూ రాసిన విధంగానే నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చకు దారి తీస్తోంది. ఈరోజు జరిగే వార్త నిన్ననే కోమటిరెడ్డికి ఎలా తెలుసని? పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తెలియకపోతే షబ్బీర్ అలీనే ప్రస్తావిస్తూ ఎందు లేఖ రాసారని తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ప్రశ్నలు రేకిత్తిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ లో రగడ మొదలు కానుందని తెలుస్తోంది. అయితే.. ముందే జరిగే విషయాలను లేఖ రూపంలో ఎలా బయటకు వస్తాయని చర్చలకు దారితీస్తోంది.
Read also: Allu Sirish: నవంబర్ 4న గీతాఆర్ట్స్ బ్యానర్ నుండి సినిమా!
నేడు తెలంగాణకు చెందిన ఐదుగురిపై ఐడీ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు, మాజీ ఎంపీ అంజన్ యాదవ్, షబ్బీర్ అలీ, మాజీ మంత్రి రేణుకాచౌదరికి సైతం నోటీసులు పంపించారని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం ఐదుగురికి ఈడీ నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా తమకు నోటీసులు అందలేదని తెలిపారు. దీంతో సర్వత్రా చర్చకు దారితీస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో అక్టోబర్ 10న డిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే సోనియా, రాహుల్ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
Allu Sirish: నవంబర్ 4న గీతాఆర్ట్స్ బ్యానర్ నుండి సినిమా!
