Komatireddy Venkat Reddy Gives Warning To Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడాలని, రాజకీయాల మీద అవగాహన పెంచుకొని మాట్లాడమని సూచించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను కోమటిరెడ్డి అలా ఘాటుగా బదులిచ్చారు. అలాగే.. బీజేపీ ఎవరికి ‘బీ టీమ్’ అనేది విశ్వేశ్వరరెడ్డిని అడిగితే చెప్తారని.. బీజేపీని ప్రజలు నమ్మడం లేదని స్వయంగా ఆయనే చెప్పారని గుర్తు చేశారు. ముందు విశ్వేషర్ రెడ్డికి సమాధానం చెప్పమని డిమాండ్ చేశారు.
Gudivada Amarnath: ఏపీలో పారిశ్రామిక విప్లవం.. చంద్రబాబు నుంచే పవన్‌కు ప్రాణహాని..!
ఇక కేసీఆర్ కేవలం మూడు నియోజకవర్గాలకే సీఎం అని.. అవి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్‌కి 80 సీట్లు వస్తాయని.. తప్పకుండా తమ ప్రభుత్వమే రాష్ట్రంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలు ఓ దగా అని ఆరోపించిన ఆయన.. ఎప్పుడూ లేనిది శంకరమ్మ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆమెకు ఓడిపోయే సీటు ఇచ్చి, ఇంకా అవమానపరిచారంటూ మండిపడ్డారు. గాయత్రీ రవికి రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్.. శంకరమ్మకు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. ‘తన్ని తరుముతా’ అని చెప్పిన తలసానిని మాత్రం మంత్రిని చేశాడన్నారు. దానం తరిమి కొడితే.. ఆయన్ను ఎమ్మెల్యే చేశారని చెప్పుకొచ్చారు. శంకరమ్మకు కేసీఆర్ ప్రభుత్వం 9 ఏండ్లుగా దగా చేసిందని ఆరోపించారు.
Cyber Harassment: ఆన్‌లైన్‌లో బ్లాక్ చేసినందుకు ఆ వెబ్‌సైట్‌లో ఫోటోలు అప్‌లోడ్.. ఇలా పట్టేశారు!
తమ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వస్తారని.. బీజేపీలో ఇబ్బంది పడుతున్న వారందరూ కాంగ్రెస్‌లో చేరుతారని వెంకటరెడ్డి తెలిపారు. తమ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు సైతం తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. పొంగులేటి, జూపల్లి చేరిక తర్వాత మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఈసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.