Komatireddy Venkat Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Gives Clarity On His BRS Congress Alliance Comments: వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ చేతులు కలుపుతారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. వరంగల్ సభలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని మాత్రమే తాను రిపీట్ చేశానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సర్వేల ఆధారంగానే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తాను స్వతహాగా ఎలాంటి సర్వేలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా.. బీజేపీ నేతలు తన వ్యాఖ్యలపై రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని.. తన వ్యాఖ్యలు ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమవుతుందని అన్నారు. హంగ్ వస్తుందని తాను అనలేదని పేర్కొన్నారు. చిన్న చిన్న నాయకులు సైతం తనని తిట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రస్తుతం తాను ఏ కమిటీలో లేనని వెల్లడించారు. తాను కన్ఫ్యూజన్లో ఉన్నానని బీజేపీ వాళ్లు అంటున్నారని, అయితే వారే అయోమయంలో ఉన్నారన్న విషయం వాళ్లకు తెలియడం లేదని చురకలంటించారు. తానేం తానేం తప్పు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
Supreme Court : బెయిల్ ఇవ్వండి బిడ్డను కంటాం.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
కాగా.. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి, వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎలెక్షన్స్‌లో ఏ పార్టీకి సొంతంగా 60 సీట్లు రావని, అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు కేసీఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సెక్యులర్ పార్టీలని.. అందుకే ఈ రెండు పార్టీలు కలుస్తాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, కానీ ఎన్నికల తర్వాత పొత్తులుంటాయని ప్రకటించారు. అయితే.. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి తిరిగొచ్చాక వెంకటరెడ్డి పేర్కొన్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రేతో వెంకటరెడ్డి సమావేశమయ్యారు. వారిద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని థాక్రే తేల్చి చెప్పారు. వరంగల్ సభలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
Jagapathi Babu: పెద్ద కూతురికి పెళ్లి చేసి తప్పు చేశా.. చిన్నదానికి నేను పెళ్లి చేయను
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!