Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలి

Komatireddy

Komatireddy

Komatireddy Venkat Reddy : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, “మా స్టార్ బ్యాట్స్‌మన్ నువ్వే” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చెప్పగా, వెంటనే స్పందించిన కోమటిరెడ్డి, “మా కెప్టెన్ నువ్వే” అంటూ ఉత్తమ్‌ను సంబోధించారు. తరువాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కోరారు. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై స్వయంగా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే ప్రజలకు స్పష్టత వస్తుందని అన్నారు.

Piyush Goyal: భారత్ ఎవరికీ తలవంచదు.. అమెరికా సుంకాల వేళ కీలక ప్రకటన..

అయితే ప్రతి అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్‌లను మాత్రమే మాట్లాడమని కేసీఆర్ సూచించడం సరికాదన్నారు. అలా అయితే ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలని, అవసరమైతే ఆ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించాలన్నారు. రేపు అసెంబ్లీలో జరగబోయే కాలేశ్వరం కమిషన్ నివేదికపై చర్చకు ముందు కాంగ్రెస్ నేతల సరదా సంభాషణతో పాటు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

Trump: ట్రంప్‌కు సీరియస్!.. జోరుగా ప్రచారం

Exit mobile version