Komatireddy Rajagopal Reddy Fires On CM KCR: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్‌గా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని.. 9 ఏళ్ల క్రితం కల్వకుంట్ల కుటుంబ ఆస్తి ఎంత, ఇప్పుడెంత అని ప్రశ్నించారు. మునుగోడులో కేసీఆర్ అడ్డదారిలో గెలిచారని, ఆయనపై ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపే చూస్తున్నారని.. ప్రధాని మోడీ హయాంలోనే కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయొచ్చని వాళ్లు భావిస్తున్నారని తెలిపారు.
Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో భారీ మోసం.. 72 లక్షలు స్వాహా
రాష్ట్రంలో నిజమైన కురక్షేత్రం ముందుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన కొనసాగడం బాధాకరమని అన్నారు. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూం వంటి పథకాలన్నీ కేవలం ఎన్నికల జిమ్మిక్కులేనని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తానని మాటిచ్చిన కేసీఆర్.. ఆ మాట తప్పారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా కేసీఆర్ సర్కార్ కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. అధికారం, డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ ఉంటే.. బీజేపీ వైపు ధర్మం, ప్రజాబలం ఉన్నాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో.. బీజేపీ అభ్యర్థులను గెలిపిచేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్‌లో దీన్ని వ్యతిరేకిస్తాం
అంతకుముందు కూడా.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా మర్చిపోయారని అన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే పెన్షన్లు, రైతుబంధు పథకాలను కేసీఆర్ సర్కార్ అందిస్తోందన్నారు. కేసీఆర్ తన పార్టీలో పేరులో తెలంగాణ పదం తీసి, బీఆర్ఎస్ పేరు పెట్టి.. తన గుంత తానే తీసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ తుగ్లక్ మాదిరిగా పరిపాలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తన కుటుంబం, తన బిడ్డల భవిష్యత్తు కోసమే కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. తెలంగాణ ప్రజలకు ఆయన ఏం న్యాయం చేస్తారని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్‌పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్