Komatireddy Rajagopalreddy: తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరడం లేదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి కేసీఆర్ కుటుంబసభ్యులకు మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్‌లో బీజేపీ బహిరంగ సభకు హాజరైన రాజగోపాల్ రెడ్డి.. టీఆర్‌ఎస్‌పై కామెంట్లు చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాని ఆయన అన్నారు. అసెంబ్లీ వేదికగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రశ్నించానన్నారు.
Rahul Gandhi: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాహుల్ ఫైర్.. దేశాన్ని విభజిస్తున్నాయి..
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారన్న ఆయన.. తాను స్వార్థం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం, పార్టీ మారలేదన్నారు. తాను రాజీనామా చేశాను కాబట్టే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు మంజూరయ్యాయన్నారు. నియోజకవర్గంలో రోడ్లు గట్టుప్పల్ మండలంగా ఏర్పడిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేసినట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నిజంగా అమ్ముడుపోయి ఉంటే మీ ముందు వచ్చి నిలబడే వాడ్ని కాదని ప్రజలనుద్దేశించి అన్నారు. ధర్మ పోరాటంలో మునుగోడు ప్రజలు అండగా నిలబడతారని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను తిరగరాసే అవకాశం మునుగోడు నియోజకవర్గం ప్రజలకు వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇంటింటికి వచ్చి అందరినీ కలుస్తానన్న ఆయన.. అందరి ఆశీర్వాదం తనకు కావాలని కోరుకున్నారు.