Rajagopal Reddy: నా వల్లే ప్రభుత్వం కదిలొచ్చింది.. కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు
Komatireddy Rajagopal Reddy Comments On KCR: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. మునుగోడు నియోజకవర్గానికి కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను రాజీనామా చేయడం వల్లే, మునుగోడుకు ప్రభుత్వం కదిలి కదిలి వచ్చిందన్నారు. ఒకవేళ తాను రాజీనామ చేయకుంటే, మునుగోడు గురించి ఏ ఒక్కరూ మాట్లాడేవారు కాదని, ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే మునుగోడులో అభివృద్ధి పనులు చేసి ఉంటే, ఇప్పుడు ఇంత సైన్యం ఎందుకని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో తనను ఓడించేందుకు.. కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
అంతకుముందు.. తెలంగాణలో కుటుంబ పాలన మీద వస్తోన్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేకే తనపై కేసీఆర్, కేటీఆర్ చిల్లర్ ఆరోపణలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే.. బీజేపీ అందించే కాంట్రాక్ట్ పనులను పొందడం కోసమే బీజేపీలో చేరారని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలకు సైతం గట్టి సమాధానం ఇచ్చారు. తాను ఇప్పుడిప్పుడే కొత్తగా కాంట్రాక్ట్ అవతారం ఎత్తలేదని.. టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందు నుంచే కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నానని కౌంటర్ ఇచ్చారు. ఎప్పటి నుంచో తనకు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ వ్యాపారాలున్నాయని.. కాంట్రాక్ట్ పనులు చేయడం తనకేమీ కొత్త కాదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ నేతల తీరు చూస్తోంటే.. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
-
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
-
DJ Sound: డీజే సౌండ్‌కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
-
Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్‌కు బిగ్ షాక్!
-
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!