NTV Telugu Site icon

Sarpanch Bhukya Kumari: మహిళా సర్పంచ్ ఆత్మహత్య.. పురుగులు మందు తాగి..

Sarpanch Bhukya Kumari

Sarpanch Bhukya Kumari

Sarpanch Bhukya Kumari: ఓ మహిళా సర్పంచి కూడా ఆకతాయిల వేధింపులు తప్పలేదు. సర్పంచ్‌ పదివిలో వున్నా ఆమెపై కన్నేసాడు ఓ కామాంధుడు. అవకాశం కోసం వేచి చూసాడు. ఆమె ఒంటరిగా కనిపించేసరికి సర్పంచ్‌ పై అత్యాచారం చేసాడు. దీంతో అవమానం భరించలేక సర్పంచ్‌ ఆత్మహత్య చేసుకున్నా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

read also: Congress Protests Live Updates: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన కాంగ్రెస్ నిరసనలు

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీలో భూక్యా కుమారి సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోమటిపల్లిలో పర్యటన సందర్భంగా నవీన్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి మరో వ్యక్తి బుజ్జి అనే వ్యక్తి సహకరించాడు .అయితే ఇది చూసిన మరో వ్యక్తి భర్తకి సమాచారం అందించారు. దీంతో భర్త అక్కడికి వచ్చి భార్యను తీసుకొని వెళ్ళాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై సర్పంచ్‌ తన పరువు పోయిందని మనస్తాపంతో.. ప్రజా ప్రతినిధి అయిన కోమటిపల్లి సర్పంచ్ భూక్యా కుమారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం ఆసుపత్రి అట్నుంచి హైదరాబాద్ కి తరలించారు. హైదరాబాదులో చికిత్స పొందుతూ సర్పంచ్‌ భూక్యా కుమారి నిన్న (గురువారం) మృతి చెందారు. దీంతో పోలీసులు సర్పంచ్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన నవీన్, అతనికి సహకరించిన బుజ్జి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధ్యత మహిళా సర్పంచ్‌ పైనే ఇంతటి దురాగతానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నా. ప్రభుత్వం ఎన్ని కఠిచర్యలు తీసుకువస్తున్న ఇలాంటి వారు పుట్టగొడుగుల్లా పుడుతూనే వున్నారు. ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడుతూ.. పోలీసులు వారిని శిక్షించినా.. మళ్లీ బయటకు వచ్చి వారి కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. మరి మహిళా సర్పంచ్‌ పై అత్యాచారం చేసిన వీరిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
MP Gorantla Madhav Issue: ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోపై విచారణ.. కఠిన చర్యలు తప్పవు..!