NTV Telugu Site icon

Komatireddy: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కోమటి రెడ్డి

Komatireddy Venkatreddy

Komatireddy Venkatreddy

Komatireddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలుత సీఎంగా రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని భావించారు. కానీ ఆతరువాత జరిగిన కొన్ని పరిణామాలతో దాదాపు 12 మంది మంత్రులతో సహా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోమటిరెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధులుగా శ్రీమతి సోనియా గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి గాంధీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల, ప్రియాంక హైదరాబాద్ చేరుకుని ఎల్బీనగర్ స్టేడియంకు పయనం అయ్యారు.

Read also: Parliament Winter Session 2023: నాలుగో రోజుకి చేరుకున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

డిసెంబర్ 3న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై దాదాపు 56 వేల మెజారిటీతో భారీ మెజారిటీతో గెలుపొందారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999 నుంచి వరుసగా నాలుగుసార్లు నల్గొండ నుంచి గెలుపొందారు. 1999లో కోమటిరెడ్డి తన సమీప సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డిపై విజయం సాధించగా, 2004లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డిపై, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డిపై గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వెంకటరెడ్డి భువనగిరి నుంచి పార్లమెంటు సభ్యునిగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కోమటిరెడ్డి ఐటీ, ఓడరేవులు, సహజ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన అభిమానులు నల్గొండ జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్