NTV Telugu Site icon

Tiger Search Operation: కొమురం భీం జిల్లా అడవుల్లో పులి టెర్రర్.. టైగర్ కోసం సెర్చ్ ఆపరేషన్

Tiger

Tiger

Tiger Search Operation: కొమురం భీం జిల్లా అడవుల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసిన పులి.. బెబ్బులి భయంతో పంట చెన్ల వైపుకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఇటిక్యాల పహాడ్, దుబ్బగూడ శివారు ప్రాంతాల వైపు వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెద్దపులి సంచారంతో పశువుల సైతం దొడ్లకే పరిమితం అవుతున్నాయి. పులి జాడ కోసం అటవీశాఖ అధికారుల ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒక వైపు డ్రోన్లు మరో వైపు ట్రాప్ కెమెరాలు.. దేనికి ఇప్పటి వరకు పులి ఫోటోలు చిక్కలేదు. కేవలం పాద ముద్రలను మాత్రమే అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

Read Also: Filmfare OTT Awards 2024: ఫిలింఫేర్‌ 2024 ఓటీటీ అవార్డ్స్ విజేతల లిస్ట్ ఇదే

కాగా, పులి ఫోటో చిక్కితే దాన్ని చారలను బట్టి అది ఏ పులి దాని పేరేంటి అనేది తెలుసుకునే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇంతకీ పులి ఆడదా.. మగదా.. దాని పేరు తెలిస్తే దాని ప్రవర్తన ఏంటో అంచనా వేసే అవకాశం ఉంది. ఒక వేళ ఇక్కడి దాడి చేసిన పులి మహరాష్ట్రలో సైతం మనుషులపై దాడి చేసిందని నిర్థారణ అయితే మాత్రం దాన్ని పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఆత్మ రక్షణ కోసం దాడి చేసిందా.. గతంలో పులి చరిత్ర ఏంటో చెలిస్తే దాన్ని బట్టి డాటింగ్ (మత్తు ఇచ్చి బంధించడం) ప్రక్రియ చేపట్టి ఛాన్స్ ఉందని ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు.