NTV Telugu Site icon

MLA Seethakka: మోడీకి, కేసీఆర్‌కి తేడా లేదు.. నోటీసులు ఇవ్వడమేంటి?

Seethakka On Kcr

Seethakka On Kcr

MLA Seethakka Fires On Modi and KCR: ప్రధాని మోడీకి, సీఎం కేసీఆర్‌కు తేడా లేదంటూ ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. కొమురం భీమ్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆమె.. లీకుల విషయంలో ఆరోపణలు చేస్తే, విచారణ జరపాల్సింది పోయి నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉన్న ఆదారాలతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాక యువత సెల్‌ఫోన్, మద్యానికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఉద్యోగం కోసం కష్ట పడితే.. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి, తమ దగ్గర వాళ్లకు ఇచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ అయినప్పుడు.. ఆ భాధ్యత ప్రభుత్వానిది కాకపోతే ఇంకెవరిది ఉంటుందని నిలదీశారు. వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే మాకేం సంబంధం అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సిట్ అధికారి కేసీఅర్‌కు దగ్గరి వక్తేనని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక.. నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని మండిపడ్డారు. సిట్ కాదు.. సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్

అంతకుముందు.. ఈ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టేసి.. కేవలం తమ వారి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సింగరేణిలో కూడా ఇలాగే అవకతవకలు జరిగాయన్నారు. లాంగ్ జంప్ తగ్గించాలని ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జామ్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాదని, అభ్యర్థులకు వచ్చిన మార్కుల లిస్ట్‌ని బయటపెట్టాలని కోరారు. మధ్యం, పబ్స్, బెల్ట్ షాపుల్లో మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వమే యువతను మద్యానికి బానిస చేస్తోందని అన్నారు. పేపర్ లీకేజ్‌తో టీఎస్‌పీఎస్‌సీపై నమ్మకం పోయిందని, ఈ లీకేజ్‌లో అధికార పార్టీ లీడర్ల పాత్ర ఉంది కాబట్టే మార్కుల లిస్ట్‌ని బయటపెట్టడం లేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువతను మభ్యపెడుతున్నాయని.. యువతకు ఆశ పెట్టి, కోచింగ్ సెంటర్‌ల చుట్టూ తిప్పుతున్నారని వెల్లడించారు.

Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..

Show comments