గాలి, నీరు, ఆహారం లాగే జీవికి శృంగారం కూడా ముఖ్యమైన అవసరాల్లో ఒకటి. శృంగారంవ‌ల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి.

శృంగారంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనే దంప‌తులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారట. 

రోజూ శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల హార్మోన్‌ల ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 

నిత్య శృంగారం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే శృంగారంతో శారీరక సంతృప్తి మాత్రమేగాక ఒంట్లో యాంటీబాడీస్ సంఖ్య​ పెరుగుతుంది. 

నిత్య శృంగారంవ‌ల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయి. 

నిత్య శృంగారంవ‌ల్ల గుండెపోటు రిస్క్ కూడా తగ్గుతుంది. సాధారణంగా హార్మోన్‌లు బ్యాలెన్స్ త‌ప్పడంవ‌ల్ల గుండెపోటు వ‌చ్చే ప్రమాదం ఉంటుంది.

శృంగారం వ‌ల్ల శరీరంలో ఈస్ట్రోజన్​, టెస్టోస్టిరోన్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయ‌ట‌. దాంతో గుండెపోటు వచ్చే ప్రమాదం త‌గ్గుతుంది.

నిత్యం శృంగారంలో పాల్గొనే జంట‌ల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఏ ప‌ని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తారు.

 నిద్రలేమి స‌మ‌స్యకు కూడా నిత్య శృంగారం చ‌క్కని ప‌రిష్కార‌ మార్గమని నిపుణులు చెబుతున్నారు.