Site icon NTV Telugu

Kishan Reddy: భూమిని కేటాయించండి.. సీఎం కు కేంద్ర‌మంత్రి లేఖ‌..!

Kishanreddy Kcr

Kishanreddy Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి లేఖ రాశారు. రామ‌గుండం ప్రాంతంలో 100 ప‌డ‌క‌ల ఈఎస్ఐ (ESI) ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కార్మికుల వైద్య అవసరాలను గుర్తించి, నగరంతో పాటు ..జిల్లాలకు కూడా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరించడానికి కేంద్ర కార్మిక శాఖ ఎన్నో చర్యలు చేపట్టిన విషయం విధితమే. ఈనేప‌థ్యంలో.. తెలంగాణ ప్రాంతంలో ఎంతో కీలకమైన రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ 2018 లోనే రామగుండంలో వంద పడకల అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పించింది. ఆమేరకు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ కేంద్ర కార్యాలయం కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ సెప్టెంబ‌ర్ 20 2018లో.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

అనంత‌రం ESIC ప్రాంతీయ కార్యాలయం పలుమార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని తక్షణమే భూమి కేటాయించాలని ఉత్తరాల ద్వారా కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేక‌పోవ‌డమే కాకుండా.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ESIC ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల మే నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశలో కూడా రామగుండంలో వంద‌ పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపులో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న తీవ్ర జాప్యం గురించి చర్చించిన విష‌యం తెలిసిందే.. కావున‌ భూ కేటాయింపులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని రామగుండం పరిసర పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని.. మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని సత్వరమే రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాన‌ని కిషన్ రెడ్డి లేఖలో వివ‌రించారు.

Nothing Phone 1: నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు.

Exit mobile version