కూకట్ పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైనిక్ వందన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడం ఎంతో సంతోషం కలింగించిందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మార్పీ ఎస్‌తో కలిసి చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయాలని ఉద్యమం చేశామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ ఉద్యమాన్ని గుర్తించి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకుని వచ్చారని ఆయన అన్నారు. సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు సైనిక్ వందన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను ఆయన అభినందించారు.
భారత ప్రభుత్వం సైనికులకు అండగా ఉంటుంది. రక్షణ విభాగంలో అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుని బలంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఏ దేశం భారత్‌పై దాడి చేయలేదని ఆయన పేర్కొ న్నారు. కాగా దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అవయవాలు కోల్పోయిన వారికి కృత్రిమ అవాయవాలు అందజేస్తున్న భారత్ వికాస్ పరిషత్‌ను కిషన్‌రెడ్డి అభినందించారు.