Kishan Reddy: రామగుండంలో ఎరువుల పరిశ్రమను మోడి ప్రారంభించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాగజ్ నగర్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల కార్యాచరణను మొదలు పెట్టిందన్నారు. దేశంలోని ప్రజలందరూ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలని భద్రత ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. అది నరేంద్ర మోడీ వల్లే సాధ్యమవుతుందని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా మళ్లీ మూడే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఐదు సంవత్సరాలపాటు నరేంద్ర మోడీ గారు నాలుగు అంశాలపై దృష్టి సాధించారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు గాని, సంక్షేమ కార్యక్రమాన్ని కానీ, మౌలిక అంశాలు, వ్యవసాయం కాకుండా మరో నాలుగు అంశాలపై మోడీ ద్రుష్టి సాధించారని అన్నారు.
ఆదివాసీ ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి జన్ మన్ యోజన పథకానికి మోడీ శ్రీకారం చుట్టారని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా అలాంటి కొన్ని ప్రాంతాలను గుర్తించాము వాటిలో కొన్ని ఆదిలాబాద్ లో కూడా ఉన్నాయి వాటి అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఆదివాసి ప్రాంతంలో అభివృద్ధి చేయకపోతే మరో 75 సంవత్సరాలైనా వారు అభివృద్ధిలోకి రారని తెలిపారు. రానున్న 5 ఏళ్ళ పాటు మహిళ సంక్షేమం కోసం వారి హక్కుల కోసం సాధికతర కోసం కూడా కేంద్రం పని చేస్తుందన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేశామని, మహిళ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చామన్నారు. గ్రామాలలోని మహిళల సమగ్ర అభివృద్దికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. టాయిలెట్స్ నుండి మెుదలుకొని బ్యాంక్ అకౌంట్స్ వరకు మహిళలకు అందించామన్నారు. సైన్యంలో కూడా మహిళ ప్రవేశాన్ని ప్రోత్సాహమిస్తున్నామన్నారు. మహిళ శక్తిపై పూర్తి స్థాయిలో తొడ్పాటును ఇస్తామన్నారు. రైతుల అభివృద్దిపై కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. యువతను కూడా అనేక రకాలుగా పొత్సాహిస్తుందన్నారు. స్టాండ్‌ప్, స్టాటప్ ద్వారా యువతను కేంద్రం ప్రోత్సాహమిస్తుందని అన్నారు.
Read also: Singer Sagar : తండ్రి అయిన సింగర్ సాగర్..
అనేక రంగాలలో ఎంప్లాయిమెంట్ పొందిలే అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యువత శక్తియుక్తులను దేశానికి అవసరమైన విధంగా వాడుకునేలా కృషి చేస్తున్నామన్నారు. యువశక్తితో ప్రపంచాన్ని శాసించేలా యువతను తీర్చిదిద్దడంపై వచ్చే ఐదెళ్ళలలో ప్రయత్నిస్తామన్నారు. పేదలను అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అన్ని వర్గాలలో ఉన్న పేదలను, బీసీ,ఎస్సీ,వివిధ వర్గాలలో ఉన్న పేదల గుర్తించి అభివృద్ది చేస్తామని క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ ను 6 రెట్లు పెంచడం జరిగిందన్నారు. ఎరువులు కొరత, విద్యుత్ కోతలు లేని విధంగా దేశాన్ని తీర్చిదిద్దామన్నారు. విద్యుత్ గ్రిడ్ ఏర్పాటుతో అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేశామన్నారు. విద్యుత్ కోతలు లేని భారతదేశాన్ని నిర్మాణాన్ని నిర్మించామన్నారు. ఎక్కడ ఎరువుల కొరత లేదన్నారు. ప్రపంచమంతా ఎరువులు ధరలు పెరిగిన మన దేశంలో మాత్రం ఎరువల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రతి ఏడాది రెండు సార్లు రైతుల అకౌంట్ లలో కిసాన్ సమ్మాన్ నిధులు వేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలోని 40 లక్షల మంది రైతులను అకౌంట్ లలో డబ్బుల జమ చేశామన్నారు. చెరుకు, పత్తి మద్దతు ధర పెంచామన్నారు. ఈ 9 ఏళ్ళలో 70 శాతం మద్దతు ధరను పెంచామన్నారు. 9 ఏళ్ళలలో తెలంగాణలో వరి కొనడానికి రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టింది కేంద్రం అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు 1,50000 ఖర్చు పెట్టి తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. గత ముఖ్యమంత్రి తెలంగాణలో పసల్ భీమా అమలు కాకుండా చేశాడన్నారు. రైతుల భూముల వివరాలు కేంద్రానికి ఇవ్వలేదని గుర్తు చేశారు. రామగుండంలో ఎరువుల పరిశ్రమను మోడి ప్రారంభించారన్నారు. రైతులకు సబ్సిడీలో ఎరువులను అందిస్తుంది కేంద్రం అని, రూ.2236ల యూరియాపై సబ్సిడీ ఇస్తుంది కేంద్రం అన్నారు. వన్ నెషన్ వన్ యూరియకు రైతులకు యూరియాను అందిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యూరియా ధరలు పెరిగాయన్నారు.
కానీ పెరిగిన ధరలను కేంద్రమే సబ్సీడిగా భరిస్తుందన్నారు. ఎరువుల మీద అత్యధిక సబ్సిడి అందిస్తుంది కేంద్రం ఒక్క రైతుకు ఎకరాకు రూ. 20,000 సబ్సీడిని కేంద్రం అందిస్తుందన్నారు. తెలంగాణ రైతులకు 35 వేల కోట్లు సబ్సీడిని కేంద్రం చెల్లించిందని గుర్తు చేశారు. నానో యూరియాను ప్రోత్సాహిస్తామన్నారు. దీని మెరుగైన పలితాలు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి డ్రోన్ అందిస్తామన్నారు. గ్రామ మహిళ సంఘాలోని మహిళకు పైలెట్ గా శిక్షణ ఇచ్చి గ్రామంలోని అన్ని పంటలకు నానో యూరియా పెస్టిసైడ్స్ అన్నారు. స్పై చేసేలా చేస్తామన్నారు. తెలంగాణలో సగంలో ఆగిన ప్రాజెక్ట్ లకు రూ. 2500 కోట్లు ఇచ్చి పూర్తి చేసేందుకు కేంద్రం కృషి చెస్తుందన్నారు. రైతుల ఉత్పత్తుల రవాణా చేయాడానికి రైళ్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. సిర్పూర్ కాగజ్ నగర్, అదిలాబాద్, నిజామాబాద్ రైతులకు లబ్ది చేకురేలా ఇనాం మార్కెట్ ద్వారా నేషనల్ ఆగ్రికల్చర్ పోర్టల్ కు అనుసంధానం చేశామని తెలిపారు. ఈ నేషనల్ ఆగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ ద్వారా తెలంగాణలో 40 లక్షల మంది లబ్ది చేకూరిందన్నారు. తెలంగాణలో రూ. 3 లక్షల 50వేల కోట్ల రుణాలు కేంద్రం రైతులకు ఇచ్చింది.. మెుత్తంగా 38 వేల రైతులు లబ్ది పొందుతున్నారు.
Kesineni Nani: ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం..