టాలీవుడ్ రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు ప్రముఖ సింగర్ సాగర్ ఇప్పుడు ఆయన తండ్రి అయ్యాడు.. గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్నీ తానే సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు.. సినీ ప్రముఖులు సాగర్ కు శుభాకాంక్షలు తేలుతున్నారు..
ఈయన 2019 లో డాక్టర్ మౌనికని పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 21న మౌనిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. ఇక ఈ వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు.. ఆ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఈ జంటకి గతంలోనే ఒక బిడ్డ పుట్టినట్లు సమాచారం… ఇప్పుడు పుట్టిన మగ బిడ్డ రెండో సంతానం. ఇక సాగర్ అన్న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లోనే ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇదిలా ఉండగా.. దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు ఈ వార్త చూసి.. సంతోషిస్తూ సాగర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ అదే సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్ ఇంకా పెళ్లి చేసుకోలేదని బాధ పడుతున్నారు.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో డీఎస్పీ ఒకరు.. గతంలో ఈయన పెళ్లి చేసుకుంటున్నట్లు ఎన్నో వార్తలు వినిపించాయి.. కాగా దేవిశ్రీ చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. ఈ ఆరు చిత్రాలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. పుష్ప 2, తండేల్, ఉస్తాద్ భగత్ సింగ్, కంగువ, రత్నం, ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా ఉంది. పుష్ప 1 పాటలతో ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా తన సౌండ్ కొంతవరకు వినిపించిన దేవిశ్రీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో గ్లోబల్ వైడ్ తన మ్యూజిక్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు..