Kishan Reddy: మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూసుఫ్ గూడ కృష్ణానగర్ లో జైన్ మందిర్ ను సందర్శించారు. అనంతరం మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ, శ్రీనగర్ నగర్ డివిజన్, హైలైన్ కాలనీ నుంచి కిషన్ రెడ్డి ప్రచార యాత్ర ప్రారంభమైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పోయిండు.. ఆయన పని అయిపోయింది.. కేసీఆర్ ఇక రాడని తెలిపారు. ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది.. వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. హామీల పేరు చెప్పుకుని.. అధికారంలోకి రాగానే మోసం చేసిందన్నారు. మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేమన్నారు.
Read also: Salar : టీవీలో ‘సలార్’.. చూసినొళ్ళకు బంపర్ గిఫ్ట్..
దేశానికి ఎవరు ప్రధాని కావాలో.. ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించే ఎన్నికలు ఇవి అని తెలిపారు. మోడీ నాయకత్వంలోనే మనం కొనసాగాలన్నారు. దేశంలోని అనేక సమస్యలను మోడీ పరిష్కరించాడన్నారు. 25వ తేదీన అమిత్ షా వస్తున్నారు.. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో సభ ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ నేతల సభలు ఉంటాయి.. ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. మోడీ కూడా తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. సభల కంటే ఓటర్లను రీచ్ అయ్యేలా కార్యక్రమాలు చేస్తామన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్ ఎన్ని యాత్రలు చేసిన కూడా ప్రజలు నమ్మరు.. ఓట్లు పడవని కీలక వ్యాఖ్యలు చేశారు.
Volunteer: ఎన్నికల నేపథ్యంలో ‘వాలంటీర్’ టైటిల్‌తో సినిమా..
