NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: Kishan Reddy: బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదని.. కవిత అరెస్టు పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు నేడూ ఈడీ ముందు విచారణ ఎదుర్కొంటుందని అన్నారు. బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం లో జరిగిన అవినీతి అన్నారు. తెలంగాణా ప్రజలకు ఆదాయం తెచ్చేందుకు కవిత ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం చేశారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం పై విచారణ చేస్తే కవిత పేరు వచ్చిందన్నారు. కవిత అరెస్టు అయితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేసేస్తున్నారు? అని ప్రశ్నించారు. గతం లో మధ్య నిషేధం చేస్తాం అని చెప్పి ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యం అమ్మకాలతో పేదల రక్తం తాగుతోందని తెలిపారు. బీనామీ పేర్లతో వ్యాపారం చేశారు, ఆధారాలను ధ్వంసం చేసి బీజేపీ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read also: Revanth Reddy: ఇన్నాళ్లు సీఎంగా చూశారు.. ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్‌ గా నేనేంటో చూస్తారు..!

అవినీతి కి పాల్పడితే బీజేపీ కార్యకర్తలు అయిన విపక్షాల నేతలైనా విచారణ ఎదుర్కోవాలని తెలిపారు. కవిత అనుచరులు, బినామీలను విచారిస్తే కవిత పాత్ర ఉందని తేలిందని క్లారిటీ ఇచ్చారు. విచారణ కు పిలిస్తే సహకరించకుండా మొండికేసిందని అన్నారు. అందుకే ఇప్పుడు అరెస్టు అయ్యిందని తెలిపారు. ఇది బీరు, బ్రాందీ కేసు, ఢిల్లీ ప్రభుత్వం కేసుని క్లారిటీ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ పట్ల సానుకూలం వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొందని..మూడోసారి 370స్థానాలు బీజేపీ కి ఒంటరిగా రావాలని, ఎన్డీయే భాగస్వామ్య పార్టీ లతో కలిసి 400 స్థానాల్లో గెలుపొందుతామన్నారు. దేశం లో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పదేళ్లలో కాంగ్రెస్ హయాంలో 22లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఏం విపక్షం కూడా మోడీ ప్రభుత్వం అవినీతి చేసిందని విమర్శించే అవకాశం లేకుండా చేశామన్నారు. రేపు ఉదయం జగిత్యాలలో జరిగే సభలో మోడీ పాల్గొంటారని తెలిపారు. ఉత్తరాదిన బీజేపీ కి ఘననీయమైన సీట్లు వస్తాయని తెలిపారు.

Read also: Etela Rajender: ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. రేవంత్ ఖబర్దార్..!

చాలామంది ఐఏఎస్ లు బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏ ఒక్కరిని అడిగినా మోడీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. లక్షలాది ఉద్యమకారులు పోరాటం చేస్తే రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో నలిగి పోయిందని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలన చేశారు కాబట్టి వారిని ప్రజలు ఓడించారన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని చెప్పింది..అవినీతి పై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదు? అని ప్రశ్నించారు. గతం లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం కు సీబీఐ విచారణ జరిపించాలి అని లేఖ రాసిందన్నారు. వందరోజులు పూర్తి చేసుకున్నా ఎందుకు సీబీఐ విచారణ కు లేఖ రాలేదు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పథకాలకు ప్రచారం చేసేందుకు పెట్టిన ఖర్చు కూడా పథకం అమలు కు చేరలేదన్నారు. చదువు కున్న వారు, మేధావులు బీజేపీ లో చేయమని పిలుపునిస్తున్నా అన్నారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ అని తెలిపారు.
Praneethrao Phone Tapping case: పంజాగుట్ట పోలీసుల కస్టడీలో ప్రణీత్‌ రావు..