G. Kishan Reddy: వ్యక్తుల కోసం కుటుంబం కోసం పనిచేసే పార్టీ బీజేపీ కాదు…దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడుతూ, వ్యక్తుల పేరుతో కుటుంబ పార్టీ లు నడుస్తున్నాయన్నారు. బీజేపీ కేడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ అన్నారు. ఈ రోజు మాస్ ఆర్గనైజేషన్ గా అవతరించిందన్నారు. కార్యకర్తలు అందరూ సభ్యత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచం లోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ అని తెలిపారు.
Read also: Football Match: మైదానం పక్కనే ఆ పనికానిచ్చేసిన ప్లేయర్.. చివరకు ఏమైందంటే? (వీడియో)
పార్టీ బలపడేందుకు సభ్యత్వ నమోదు చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ నమోదు చేయాలని అన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావాలని ఆకాంక్ష ప్రజల్లో ఉందన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో విజయం సాధించాలి… దీనికి సభ్యత్వం కీలకమని తెలిపారు. ఆన్లైన్ సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి 77 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. వేలాది బూత్ లో బీజేపీ నంబర్ వన్ గా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ లు ఇచ్చి అధికారం లోకి వచ్చి వాటికి తూట్లు పొడుస్తుందన్నారు. యే ఒక దిక్లరేషన్ అమలు చేయలేదన్నారు.
Read also: Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..
దేవతల మీద ఓట్లు పెట్టీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డీ చెప్పారని మండిపడ్డారు. 50 శాతం కూడా రుణమాఫీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పై వాస్తవ పరిస్థితులు బయట పెట్టాలన్నారు. ప్రభుత్వం పెట్టకపోతే బీజేపీ ఆ వివరాలు బయట పెడుతుందన్నారు. యే గ్రామంలో కూడా రుణమాఫీ పూర్తిగా కాలేదని అన్నారు. ఒక వైపు సభ్యత్వం చేస్తూనే రైతుల సమస్యల పై పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు… ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు.
Read also: Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లిబరేషన్ డే ను చేయాలి.. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందన్నారు. అన్ని వర్గాలను బీజేపీ సభ్యులుగా చేర్పించాలన్నారు. ప్రతి కార్యకర్త వంద మందిని సభ్యులుగా చేయించాలని తెలిపారు. క్రియాశీల కార్యకర్త కావాలి అంతే వంద మందిని సభ్యులుగా చెర్పించాలన్నారు. సభ్యత్వ నమోదు ను ఒక ఉద్యమం లాగా చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలను సంఘటితం చేసి ఉద్యమం అన్నారు. కలిసి కట్టుగా , ఐక మత్యం తో సభ్యత్వ నమోదు చేయిద్దామన్నారు.
Trains Cancellation: బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు
