NTV Telugu Site icon

Kishan Reddy: ఒక వసూళ్ల రాజ్యం పోయి.. ఇంకో వసూలు రాజ్యం వచ్చింది..

Kishan Reddy Bjp

Kishan Reddy Bjp

Kishan Reddy: ఒక వసూళ్ల రాజ్యం పోయి.. ఇంకో వసూలు రాజ్యం వచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రైతు దీక్షలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. మీ హామీల అమలుకు కార్యాచరణ ఏంటో చెప్పాలని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రైతులను మోసం చేయడమే తప్ప హామీలను అమలు చేయలేరన్నారు. గత ప్రభుత్వంలో గిరిజన, దళిత, మైనార్టీ వర్గాలకు వెన్నుపోటు పొడిచారన్నారు. నేడు అదే తరహాలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. మార్పు అంటే కెసిఅర్ కుటుంబం పోయి… సోనియమ్మ కుటుంబం వచ్చిందన్నారు. తెలంగాణలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. ఒక వసూళ్ల రాజ్యం పోయి.. ఇంకో వసూలు రాజ్యం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు కొత్త రుణాలు పుట్టడం లేదన్నారు.

Read also: Summer Tips : వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన పండ్లు ఇవే..

కాంగ్రెస్ మాటలు విని రైతులు నట్టేట మునిగారన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. కానీ వసూళ్లు చేసి డిల్లీకి పంపడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏ రోగం పుట్టిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ఎందుకు చేయడం లేదన్నారు. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్ కి అలవాటన్నారు. మార్పు అంటే మతి మర్పా అని మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీ లా మీద తెలంగాణ రైతు ప్రశ్నిస్తున్నాడని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీ లను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో బీజేపీ దీక్షను చేపట్టిందని తెలిపారు.

Read also: Rahul Gandhi: రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌లో ఎన్నికల అధికారుల తనిఖీలు

వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. వరికి 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నారు. రైతు భరోసా 15 వేలు ఇవ్వాలని కోరారు. రైతు కూలీల అకౌంట్ లో 12 వేలు వెంటనే వేయాలన్నారు. ఎకరానికి 25 వేల పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ ప్రచారం స్టార్ట్ చేశామన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికిలో వేసినట్టే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు లీడర్ లేడు.. వాళ్ల కూటమికి టెంట్ లేదన్నారు. తెలంగాణలో డబల్ డిజిట్ సీట్లు గెలుస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వచ్చిన సచ్చిన పోయేదేం లేదన్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించాం.. ప్రచారాన్ని స్టార్ట్ చేశామన్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన మోడీ నినాదాలే అన్నారు.
K. Laxman: హైదరాబాద్ లో నేడు, రేపు బీజేపీ సంపర్క్‌ కార్యక్రమం