పండ్లు శరీరానికి మంచివే.. రోజుకో పండు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు వేసవిలో మాత్రం పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.. ఎండ వేడి నుంచి బయటపడవచ్చు.. నీళ్లు తాగడమే కాదు ఈ ఎండాకాలంలో రోజుకో పండు తినాల్సిందే అప్పుడే శరీరానికి అవసరమైనంత యాంటీయాక్సిడెంట్లు అందుతాయి.. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన పండ్లు ఏంటో ఒకసారి చూద్దాం..
పుచ్చకాయ..
ఏడాది మొత్తం ఈ కాయలు మనకు కనిపిస్తాయి.. అలాగే వేసవిలో విరివిగా కనిపిస్తాయి.. వీటిలో 90% నీళ్ల శాతం ఉంటుంది.. వీటిని తింటే అప్పటికప్పుడే ఇన్స్‌ట్యాంట్ ఎనర్జీ వస్తుంది. ఈ పండులో వేడిని దెబ్బతీసే నీరు, చల్లదనం పుష్కలంగా ఉంటుంది.. అందుకే సమ్మర్ లో మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ కాయలను ఎక్కువగా తీసుకోవాల్సిందే..
మామిడి పండ్లు..
వేసవిలోనే ఎక్కువగా కనిపించే పండ్లలో మామిడికాయలు కూడా ఉన్నాయి.. బంగినపల్లి, ఆల్ఫాన్సో, రసాలు లాంటి మామిడి పళ్ల తియ్యటి జ్యుస్‌లని నోరారా ఆరగిస్తారు. మామిడిలో ఫైబర్, వైటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. వేడిని కలిగించే ఈ పండ్లను మితంగా తీసుకోవడం మంచిది..
కీర దోసకాయ..
అతి తక్కువ క్యాలరీలు ఉన్న కూరగాయలలో కీర కూడా ఒకటి.. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గడం మాత్రమే కాదు.. శరీరాన్ని డీహైడ్రెడ్ గా ఉంచుతుంది.. ఇందులో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతీ రోజు తింటే డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉండదు. జీర్ణక్రియను బాగుపరచడమే కాకుండా హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది..
వీటితో పాటుగా బత్తాయిలను, ఫైనాఫిల్, కివీ, దానిమ్మ దోసకాయలు వంటి వాటిని తీసుకోవడం వల్ల వేసవి వేడి నుంచి బయట పడవచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.