NTV Telugu Site icon

Kishan Reddy: 4 నెలలుగా ఎందుకు చేయలేదు.. అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: నాంపల్లి నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లెపల్లి డివిజన్ అఘాపురంలో పవర్ బోర్ ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. గడగడపకు వెళుతూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా.. నాంపల్లి వద్ద పర్యటించిన కిషన్ రెడ్డికి స్థానికులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. స్ట్రీట్ లైట్లు లేవని, అర్ధరాత్రి బస్తిలో బయటకు రావాలంటే భయంగా ఉందని వాపోయారు. నవంబర్ లో పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని.. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని తెలిపారు. బస్తిలో అర్థరాత్రి నడవాలంటే భయం భయంతో ఇళ్లకు చేరుకోవాల్సి వస్తుందని తెలిపారు. అధికారులకు చెప్పి బస్తిలో స్ట్రీట్ లైట్లు వేయించాలని తెలిపారు.

Read also: Tollywood Films: టాలీవుడ్ అత్యంత లాభదాయకమైన సినిమాలు…!

దీంతో స్థానికుల సమస్యలను విన్న కేంద్ర మంత్రి వెంటనే అధికారులకు అక్కడకు పిలిపించారు. ఎందుకు స్ట్రీట్ లైట్స్ వేయలేదని ప్రశ్నించారు. ఒకటి కాదు రెండు రోజులు కాదు నాలుగు నెలలుగా సమస్య చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సీరియస్ అయ్యారు. అయితే అధికారులు నిధులు లేవని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే Ghmc కమిషనర్ కు ఫోన్ కలిపారు. స్ట్రీట్ లైట్స్ కోసం అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాలుగు నెలలుగా కంప్లైంట్ ఇచ్చిన ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. నిధులు లేవని ప్రజలను అంధకారంలో ఉండమంటారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించింది మల్లేపల్లి డివిజన్ అఘాపురలో వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేంద్రమంత్రి ఆదేశాలకు కమిషనర్ స్థానికంగా స్పందించినట్లు సమాచారం.
Facebook Fraud: ఆన్‌లైన్‌ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!