NTV Telugu Site icon

Kishan Reddy: కేసీఆర్‌కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy On Kcr

Kishan Reddy On Kcr

Kishan Reddy Fires On CM KCR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. వివిధ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంతో తాము చర్చలు జరుపుతున్నామని, లేఖలు కూడా రాస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్‌కు తాను పదే పదే ఉత్తరాలు రాస్తున్నానని, అయితే ఏ ఒక్క దానికి కూడా సీఎం నుండి జవాబు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని లేఖలు రాసినా.. తెలంగాణకు ప్రధాని మోడీ, కిషన్ రెడ్డి ఏం చేశారని కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ అడుగుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులకు ప్రజాప్రతినిధుల నుండి వచ్చే లేఖలను ప్రాసెస్ చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుందన్నారు. కేసీఆర్‌కు జవాబు ఇచ్చే సంస్కారం లేదు కాబట్టి, కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదని తేల్చి చెప్పారు. ట్రైబల్ మ్యూజియం కోసం భూమి ఇవ్వాలని కేంద్రం అడిగితే.. ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. అయితే.. కేంద్రం మాత్రం అందుకు ఇప్పటికే రూ.1 కోటి ఇచ్చిందని పేర్కొన్నారు.

Puri- Charmi: ఏయ్.. ప్రేమ జంట చాన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారే

అంతకుముందు కూడా.. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రంపై బురదజల్లేందుకు కేసీఆర్ అసెంబ్లీని వాడుకున్నారని.. అసెంబ్లీలో దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శించిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల్లో మోదీని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందంటూ.. ప్రపంచానికి తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, ప్రాజెక్టుల పేర్లతో వేలకోట్ల దోపిడీ రాష్ట్రంలో జరుగుతోందని ఆరోపించారు. మరొకొన్ని నెలల్లో కేసీఆర్ సీఎం గద్దె నుంచి దిగిపోతారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్‌భవన్‌లో రాజీనామా లేఖ ఇవ్వకతప్పదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Raja Singh: నకిలీ సర్టిఫికెట్ల వెనుక MIM కుట్ర ఉంది.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు