NTV Telugu Site icon

Kishan Reddy : మీ నుండి బాప్-బేటా పాలన నేర్చుకోవాలా

Kishan Reddy

Kishan Reddy

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్‌కు విచ్చేస్తున్న బీజేపీ నేతలకు స్వాగతం పలుకు బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. మరోవైపు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రధాని మోడీని బీజేపీని విమర్శిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ల మధ్య ఫ్లెక్సీల వార్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం సహకరించలేదంటూ ఆరోపణలు గుప్పించారు. మా బ్యానర్ లు తీసేశారన్నారు.

అంతేకాకుండా.. ఇటీవల మంత్రి కేటీఆర్‌ ‘ఆవో-దేఖో-సిఖో’ అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మీ నుండి నేర్చుకోవాల్సింది… బాప్ బేటా పాలన, నియంతృత్వ పాలన నేర్చుకోవాలా అంటూ మండిపడ్డారు. కేసీఆర్‌, ఎంఐఎం కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటోందని, 8 సంవత్సరాల నుండి సెక్రటేరియట్‌కు రాలేదు… నెలకు 20 రోజులు ఫార్మ్ హౌస్ లో ఉంటాడు అంటూ ఆయన ధ్వజమెత్తారు. డైనింగ్ టేబుల్ మీద జరిగే మీటింగ్ తెలంగాణ కేబినెట్ మీటింగ్ అంటూ ఎద్దేవా చేశారు. అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ వేసుకొని నేరుగా సీఎం బెడ్ రూం వరకు వెళతాడంటూ విమర్శలు గుప్పించారు. ప్రధానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు

 

 

Show comments