Site icon NTV Telugu

Jagtial Crime: కిడ్నాప‌ర్ల చెరలో తండ్రి .. 15లక్ష‌లు ఇస్తేనే..

Jagityala Crime

Jagityala Crime

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి కి చెందిన శంకరయ్య ముంబయి విమానాశ్రయం నుండి బయటికి వస్తుండగా కిడ్నాప్ కు గుర‌య్యాడు. జూన్ 22న కిడ్నాప్ గుర‌య్యాడు. అయితే త‌న‌ను వ‌దిలిపెట్టాలంటే 15ల‌క్ష‌లు డిమాండ్ చేస్తూ.. శంకరయ్య కాళ్లు చేతులు కట్టేసి ఉన్న ఫొటోను ఆయన కుమారుడు హరీష్‌కు వాట్సాప్ చేశారు. అంతేకాకుండా.. ఆ డబ్బు మొత్తం ఇవ్వాల్సిందేనని.. ఎక్కడికి తెచ్చి ఇస్తారో చెప్పాలని హరీష్‌కు ఇంటర్ నెట్ ద్వారా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్ప‌డ్డారు కిడ్నాప‌ర్లు. కాగా.. కిడ్నాప్ కు గురైన బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఎంతో క‌ష్ట‌ప‌డి వ్యవసాయం చేసుకుని బతికే తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై ముంబైలో కేసు నమోదైందని కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్నినియమించినప్పటికీ దర్యాప్తు ముందుకు సాగడం లేదని శంకరయ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చెన్నైలోని కావేరి హాస్పిటల్లో శంకరయ్యను ట్రీట్మెంట్ చేయించిన సిసిటీవీ ఫోటేజ్ స్వాధీనం చేసుకున్న ముంబై పోలీసులు. సేకరించిన సిటీ ఫోటేజ్ ద్వారా నిందితులను గాలిస్తున్నారు. వారం రోజులుగా శంకరయ్య ఆచూకీ కోసం భార్య అంజవ్వ,కొడుకు హరీష్ కూతురు గౌతమి ఆందోళన చెందుతున్నారు. కుటుంబ స‌భ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వారి కుటుంబ పెద్ద‌ను తీసుకు వ‌చ్చేందుకు స‌హాయం చేయాల‌ని వేడుకుంటున్నారు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Udaipur Incident: కన్హయ్యలాల్ హత్య.. రాజస్థాన్ లో 32 మంది ఐపీఎస్ ల బదిలీ

Exit mobile version