Site icon NTV Telugu

Khazana Jewellery : ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో కీలక పురోగతి

Khazana

Khazana

Khazana Jewellery : హైదరాబాద్‌లో జరిగిన ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్‌పై వెళ్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు దొంగలు రెండు బైకులపై పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.

Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలపై స్పందించిన నిర్మాత..

ముఖాలకు మాస్కులు, తలకు క్యాపులు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణిస్తుండటంతో వారి కదలికలు అనుమానం కలిగించాయి. దర్యాప్తులో భాగంగా, దోపిడీకి ఉపయోగించిన బైకులు కూడా వారు దొంగిలించినవేనని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆరుగురినీ విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు వెనుక ఉన్న ఇతర వ్యక్తుల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

PM Modi: టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ.. ఎప్పుడంటే..!

Exit mobile version