భూముల వేలం: కోకాపేట కంటే ఖానామెట్‌లోనే ఎక్కువ ధర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూముల వేలం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది… నిన్న కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఎంఎస్టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మొత్తం అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు అధికారులు.. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్ గా ఎకరం ధర 48.92 కోట్లుగా వచ్చింది… రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలను మంజీరా కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేయగా.. రూ.185.98 కోట్లతో 3.69 ఎకరాలు దక్కించుకుంది జీవీపీఆర్ లిమిటెడ్.. ఇక, రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలు లింక్‌వెల్ టెలీసిస్టమ్స్ సొంతం చేసుకోగా.. రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలు కొనేసింది అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్.. రూ.92.40 కోట్లతో మరో 2 ఎకరాలను కూడాతన ఖాతాలో వేసుకుంది లింక్‌వెల్ టెలీసిస్టమ్స్.
also read: నిరుద్యోగులకు అండగా పోరాటం-పవన్ కల్యాణ్
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
అయితే, కోకాపేట భూముల కంటే.. ఎక్కువ ధర పలికాయి ఖానామెట్ భూములు.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలికింది.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి రూ. 40.05 కోట్లు పలికింది.. కానీ, అదే ఖానామెట్ భూముల విషయానికి వస్తే.. గరిష్టంగా రూ.55 కోట్ల ధర పలికినా.. అవరేజ్‌గా మాత్రం 48.92 కోట్లు వెచ్చించారు.. దీంతో.. కోకాపేట కంటే ఖానామెట్‌లోనే కాసుల వర్షం కురిసిందన్నమాట.. మొత్తంగా.. కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో రూ.2729 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు