NTV Telugu Site icon

Bhatti Vikramarka: తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవు..

Bhatti

Bhatti

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వంటి పథకాలు లేవు అన్నారు. రైతు రుణం, ధాన్యం బోనస్ చారిత్రాత్మకమైన పథకాలు తెలంగాణ సర్కార్ ఇస్తుందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు 45 వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు భరోసాకు 19 వేల కోట్ల రూపాయలు.. ఆత్మీయ భరోసాకు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Read Also: Tirumala: టీటీడీలో ఎలాంటి సమన్వయ లోపం లేదు.. అది దురదృష్టకరం

ఇక, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతి స్కీంలో కన్ఫూజన్‌ ఏం లేదు.. పథకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం.. అలాగే, ఉపాధి హామీ పథకంలో సభ్యులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు అని వెల్లడించారు. ఇందులో సెంట్ భూమి లేని వారికి వర్తిస్తుంది అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉంది. అధికారులు ఇందిరమ్మ కమిటీలు సమన్వయంతో పని చేయాలి అని సూచించారు. గ్రామాల్లో గ్రామసభ డయాస్ ఏర్పాటు చేసి చర్చించాలి.. గ్రామాల్లో ముడు చోట్ల ఫ్లెక్సీలని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Show comments