Flood Situation In Godavari: గోదావరికి పెరుగుతున్న నీటిమట్టం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
- తీవ్ర ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది..
- భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ..
- 54 అడుగులు దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flood Situation In Godavari: గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు విపరీతంగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుండటంతో దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. భద్రాచలం దగ్గర నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటలకు 48.20 అడుగులుగా నమోదవ్వగా.. ఈ రోజు ఉదయానికి వరద నీటి మట్టం 54 అడుగులు ధాటి ప్రమాదకరంగా గోదావరి ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలోకి 27 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
Read Also: kanchana4 : కాంచనా 4లో దెయ్యంగా నటించనున్న పొడుగుకాళ్ల సుందరి..
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
కాగా, పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అనూహ్యంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 13లక్షల క్యూసెక్కులను దిగువకు రిలీజ్ చేస్తున్నారు. వరద నీరు పట్టిసీమ శివక్షేత్రాన్ని చుట్టుముట్టేసింది. అలాగే, గోదావరి ప్రమాదకరంగా ప్రవాహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలోకి చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముంపునకు అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరిస్తున్నారు. దీంతో పాటు భద్రాచలం దిగువన ఉన్న రహదారుల పైకి వరద నీరు చేరుతుండంతో విలీన మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!