Singareni Election Results: ఏడాదిన్నరగా ఎదురుచూసిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాగా, 94.15 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మణుగూరు సింగరేణి, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. బెల్లంపల్లి సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఐఎన్‌టీయూసీపై ఏఐటీయూసీ 122 ఓట్లతో గెలుపొందింది. ఇల్లెందు డివిజన్‌లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టియుసి విజయం సాధించింది. ఇక్కడ సీపీఐ అనుబంధ ఏఐటీయూసీపై ఐఎన్‌టీయూసీ 46 ఓట్ల తేడాతో గెలుపొందింది.
Read also: Cold Wave: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న పొగమంచు..
రామగుండం డివిజన్ 1, 2లో ఏఐటీయూసీ, రామగుండంలో 3లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి.ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. రహస్య బ్యాలెట్ విధానంలో బుధవారం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొన్నారు. అయితే టీజీబీకేఎస్ ప్రధాన నాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండడంతో ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారాన్ని మాత్రమే చేపట్టారు. ఐఎన్‌టీయూసీ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఏఐటీయూసీ, సీఐటీయూసీ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్ సంఘాల నేతలు కూడా ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ మాత్రమే సత్తా చాటాయి.
Group 2 Exam: జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా ! మళ్లీ ఎప్పుడంటే?