Minister Ponguleti: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు (జనవరి 23) ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి, హైదర్ సాయిపేట, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, పడమటి తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మధ్యాహ్నం 12:30 గంటలకు జోగులపాడులోని గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, ఆ తర్వాత చంద్రు తండా, మహ్మదాపురంలోనూ సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
Read Also: Massive Theft: అనంతపురంలో భారీ చోరీ.. రూ.3.5 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షలు మాయం
ఇక, నిన్న ఇల్లందులో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే మహాలక్ష్మీ, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ లాంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లాంటి మరో నాలుగు పథకాలను సైతం అమలు చేయబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి.. ఈ విషయంలో ఎవరూ ఆందోళన పడొద్దు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.