Mallu Bhatti Vikramarka: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పార్లమెంట్ లో స్వయాన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ర్యాలీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంబేద్కర్ మీద కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రపంచంలోనే భారత దేశం అత్యున్నత విలువలు కలిగిన ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్వాతంత్య్ర భారత దేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోమ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపారు.
Read also: Advocate Varma: సంధ్యా థియేటర్ ఘటనపై సీన్ రీ కన్స్‌ట్రక్షన్.. లాయర్ ఏమన్నారంటే ?
అమిత్ షా ప్రవర్తన మాటలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. అస్సలు ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలన్నారు. భారత రాజ్యాంగాన్ని అవమాణపరుస్తూ “పదే పదే అంబేద్కర్ అంబేద్కర్” అని నినదించడం సరికాదన్నారు. మహిళలకు సమాన హక్కు కల్పించింది భారత రాజ్యాంగమే అన్నారు. స్వాతంత్య్రాన్ని కలిగించింది భారత రాజ్యాంగమే? అన్నారు. మనం మాట్లాడే హక్కు కూడ భారత రాజ్యాంగం కల్పించిందే అని అన్నారు. అటువంటి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పార్లమెంట్ లో స్వయాన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
Read also: Allu Arjun: ప్రారంభమైన అల్లు అర్జున్ విచారణ.. బన్నీపై ప్రశ్నల వర్షం
మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రపంచ దేశంలో అత్యున్నత రాజ్యాంగం కలిగిన దేశం.. భారత దేశం అన్నారు. దేశంలో అన్ని కులాలు, మతాలు అన్న దమ్ముళ్లా కలిసి ఉంటున్నామని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలు భారత దేశాన్ని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి, అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. భారత దేశానికి, జాతికి నిరసన తెలియజేయాలని ర్యాలీ నిర్వహించామన్నారు.
Allu Arjun Live Updates: పోలీస్ విచారణకు అల్లు అర్జున్.. లైవ్ అప్డేట్స్..