Site icon NTV Telugu

Bhatti Vikramarka: నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన..

Bhatti

Bhatti

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు (మార్చ్ 6) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నేటి ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి ముదిగొండ చేరుకోనున్న ఆయన ముదిగొండ–వల్లభి రహదారిలో 5 కిలో మీటర్ల.. మేర 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే నాలుగు లేన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత తిరిగి ఖమ్మంకు రానున్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు టి.శ్రీనివాసరావు దశదినకర్మతో పాటు ఇతర కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇక, భట్టి వచ్చే హెలీకాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం ముదిగొండ శివారులోని యడవల్లి రహదారిలోని ఓ ఖాళీ స్థలాన్ని బుధవారం అధికారులు పరిశీలించారు. అక్కడే హెలీప్యాడ్‌ ఏర్పాటుతో పాటు పోలీస్‌ బందోబస్తును ఖమ్మం రూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి, ముదిగొండ సీఐ మురళి, ఎమ్మార్వో సునీత ఎలిజబెత్‌ పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాకతో ముదిగొండ కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా రానున్నారు. ఖమ్మం జిల్లాలో భట్టి పర్యటన ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్ లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో పాల్గొననున్నారు.

Exit mobile version