Congress vs BRS: లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో లీడర్ల చెంపలు పగులుతున్నాయి. గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక సందర్బంగా నాయకుల మధ్య విద్వేశాలు రగులుతున్నాయి. అయితే, తాజా ఘర్షణలకు ఎక్కువ భాగం నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణాల్లో సాఫీగా జరుగుతున్నప్పటికీ గ్రామాల్లోమాత్రం నేతల మధ్య వాగ్వావాదాలు, ఘర్షణలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో వీఎం బంజర్ లో గ్రామసభ జరుగుతుండగా కాంగ్రెస్- బీఆర్ఎస్ నాయకుల మద్య వాగ్వావాదం చోటు చేసుకుంది. అర్హల జాబితాపై తీవ్ర వాగ్వాదం జరిగింది. గత పదిహేను రోజుల క్రితం బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరిన నాయకుడికి కారు పార్టీ నేతకు మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకుడి చెంపపగల కొట్టారు బీఆర్ఎస్ నాయకుడు.. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: Danam Nagender: ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా..?
ఇక, నిన్న కూడ కారేపల్లి మండలం కొత్తూరులో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు. విజువల్స్ లో ఇందిరమ్మ కమిటి సభ్యుడి చెంప పగుల కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే, కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ లో బాధితులు టెంట్ ఊడబీకి నిరసన వ్యక్తం చేశారు.. ఇలా గ్రామ సభల్లో నిరసనలు కొనసాగుతుండగా.. ఒక్కరిపై ఒక్కరు దాడులు చేసుకుంటున్నారు.