Bhatti Vikramarka: భూమిలేని రైతు కూలీలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. సంవత్సరానికి 12 వేలు చొప్పున ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
చింతకాని మండల దళితబంధు లబ్ధిదారులకు నాగులవంచలో రెండోవిడుత యూనిట్ల మంజూరు పత్రాలను అందజేశారు. ప్రజల చేత.. ప్రజల అవసరాల కోసం ఏర్పడినదే ఈ ప్రజాపాలన ప్రభుత్వం అని అన్నారు. భారత రాజ్యాంగం మేరకు ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. ప్రజాస్వామ్యని గౌరవించ్ఛే ప్రతి ఒక్కరు ఈ ప్రజాపాలనను స్వాగతించాలన్నారు.
Read also: Sridhar Babu: 20 ఎంబీ స్పీడ్ తో ప్రతి ఇంటికి ఇంటర్ నెట్.. ఐటీ మంత్రి సంచలన ప్రకటన
గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమై ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పాలనానుండి విముక్తి కల్పించామన్నారు. ప్రజా పాలనలో అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతూ ముందుకు పోతున్నామని అన్నారు. రైతులకు పంట, వ్యక్తి ఇన్సూరెన్స్ తో పాటుగా సోలార్ పంపు సెట్లతో ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేలు చొప్పున ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందన్నారు. ఐకేపీ మహిళలు ద్వారా ఆర్గానిక్ ఫార్మిగ్ ఏర్పాటు చేసి రసాయనం లేని వ్యవసాయం చేసేలా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజాసంక్షేమం కోసమే మా పాలన పనిచేస్తుందని తెలిపారు. పక్కదారి పట్టిన దళిత బందు యూనిట్లు తిరిగి తెచ్చే బాధ్యత అధికారులదే అని అన్నారు.
Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..