NTV Telugu Site icon

Bhatti Vikramarka: ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాల స్కూల్స్ బాగుకోసం కోట్ల రూపాయాలు కేటాయించామన్నారు. ఇప్పటికీ వున్న ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షన్సియల్ స్కూల్స్ కొనసాగిస్తామన్నారు. ఏవి కూడా ముసేసిది లేదన్నారు. అన్నింటికీ శాశ్వత భవనాలు కల్పిస్తామన్నారు. అడ్డంకులు సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఉడుత ఊపులకు ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎవరు కూడా మేము చేసే అభివృద్ధిని అడ్డుకోనివ్వం అన్నారు. పాఠశాలలకి మంచి రోడ్ల ను కూడా వేస్తున్నామన్నారు. ప్రజలకు మంచి ఏమి చేస్తే బాగుంటుంది అని ఎవ్వరూ సలహాలు ఇచ్చిన తీసుకుంటామన్నారు. మంచి వుంటే అనుసరిస్తాం.. అమలు చేస్తామని తెలిపారు.

Read also: Jagadish Reddy: రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది..

ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల కోసం అంకితంగా పని చేస్తుందన్నారు. మన విద్యా వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడే విధంగా సిలబస్ తయారు చేసి విద్యార్దులను తయారు చేస్తామన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వుండే విధంగా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది సాధ్యంకాదని ప్రతిపక్షాలు అనుకున్నాయని అన్నారు. విద్య, వైద్య కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు 73 కోట్లు కేటాయించిందన్నారు. ఈ ఏడాది 5000 కోట్లు మా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. సంకల్పం చిత్తశుద్ధి వుంటే ఏది సాధ్యం కాదు.. అదే మేము నిరూపిస్తున్నామని అన్నారు. మంత్రి మండలి అంతా కూర్చొని 28 స్కూల్స్ ఫౌండేషన్ వేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటి కి భవనాలు పూర్తి చేస్తామన్నారు.

Nalgonda: పోలీస్‌ కస్టడీకి అనుముల తహసీల్దార్‌ జయశ్రీ..

Show comments