NTV Telugu Site icon

Bhatti Vikramarka: కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలుగా గెలిచి.. కాంట్రాక్టుల కోసం పార్టీ మారారు..

Batti

Batti

ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం కూసుమంచికి సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర చేరుకుంది. ర‌హ‌దారిపై పాద‌యాత్రగా వెళ్తున్న భట్టికి.. కొలిమి వద్ద ఇనుప పని చేసుకుంటున్న బాలాజీ వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాము మ‌హారాష్ట్ర నుంచి ఇక్క‌డ‌కు ప‌నిచేసుకునేందుకు వ‌చ్చామ‌ని.. పెరిగిన ధ‌ర‌ల వ‌ల్ల చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అన్నారు. కొలిమిలే వేసే బొగ్గు ధ‌ర కూడా విప‌రీతంగా పెరిగిపోయింద‌ని చెప్పారు. ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కోరారు. ఇందిర‌మ్మ రాజ్యంతో ధ‌ర‌లను స్థిరీక‌ర‌ణ చేస్తామ‌ని భట్టి విక్రమార్క చెప్పారు.

Read Also: Rain Alert: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ఇద్దరు మృతి.. గుజరాత్‌లో రెడ్ అలర్ట్

కూసుమంచి కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలేరు నుంచి స్థానిక ఎమ్మెల్యేను కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే… కాంట్రాక్ట్ ల కోసం ప్రజలను మోసం చెసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినారు అని ఆయన మండిపడ్డారు. పార్టీ మారి ప్రజలను, ఓటు హక్కును మోసం చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మోకరిల్లుతారని పాలేరు నియోజకవర్గ ప్రజలు ఊహించలేదు అని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు సమయానుకూలంగా బుద్ది చెప్తారని ఆయన అన్నారు.

Read Also: Samsung Galaxy S23 FE Launch: ఐఫోన్ 14కి పోటీగా.. శాంసంగ్ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్!

రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎందుకు అధికార పార్టీ పూర్తి చేయలేదు.. జిల్లాలో పోలీస్ లు రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇది మంచి పరిణామం కాదు.. చట్టానికి లోబడి పని చేయాలని ఏసీపీకి ఆయన హెచ్చరించాడు. పోలీస్ మ్యానువల్ యాక్ట్ ప్రకారం, చట్టబద్దంగా పోలీసులు పని చేయాలి అని సూచించారు.