NTV Telugu Site icon

Bhadrachalam Rains: భద్రగిరిని ముంచెత్తిన వాన.. అన్నదాన సత్రంలోకి వరద నీరు..

Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam Rains: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా భద్రాచలం నీటమునిగింది. రామాలయం, అన్నదాన సత్రం పరిసరాల్లోకి వరద చేరింది. ఆలయ కొండపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ కల్యాణమండపం కూలిపోయింది. భద్రాద్రి జిల్లా గరిమళ్లపాడులో అత్యధికంగా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. మహబూబాబాద్‌లోని ఉత్తరతాండ పంచాయతీ నేతాజీ తండా పాఠశాల గదులు జలమయమయ్యాయి. డోర్నకల్ శివారు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 29.9 అడుగులకు చేరుకుంది.

Read also: Weather Warning: వాతావరణ హెచ్చరిక.. మూడు రోజులు భారీ వర్షాలు..

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. రాయలసీమ నుంచి తమిళనాడు అంతర్భాగం మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర, దక్షిణ ద్రోణిలు కొనసాగుతున్నాయని, దీని కారణంగా తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలోని జోగుళాంబ గద్వా, భదాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Mahesh Babu-Vinesh Phogat: పతకం ముఖ్యం కాదు.. మీరే నిజమైన ఛాంపియన్!