Site icon NTV Telugu

Physical Harassment : ఖమ్మం స్కూల్‌లో షాక్..! విద్యార్థిని లైంగికంగా వేధించిన జువాలజీ టీచర్

Harassement

Harassement

Physical Harassment : ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన ఒక విద్యార్థి, స్కూల్‌లో పనిచేస్తున్న జువాలజీ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపాడు. విద్యార్థి తరచూ తనను టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో, తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్, కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు POCSO కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

MLA Bojjala Sudheer Reddy: డ్రైవర్‌ రాయుడు వీడియోపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు..

జువాలజీ టీచర్ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగానే, అతన్ని సర్వీస్ నుండి రిమూవ్ చేశారు. ఈ సంఘటన గురించి విషయం బయటకు రావడంతో టీచర్ భయాందోళనలో సతమతమై, పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు సమాచారం. స్థానిక పోలీస్ అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ ఈ ఘటనపై కఠిన దర్యాప్తు చేస్తున్నారని, విద్యార్థుల భద్రతకు ఏవైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించి పరిష్కరిస్తామని వెల్లడించారు.

Uttam Kumar Reddy : దేవాదుల ప్యాకేజ్6పై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

Exit mobile version