Khairatabad : హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతం మరోసారి మహా గణనాథుడి ఆగమన్‌తో పండుగ వాతావరణంలో మునిగిపోయింది. డీజెల హోరు, యువత కేరింతలు, భక్తుల జయజయకారాలతో ఖైరతాబాద్ మహా గణపతికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రత్యేకంగా మరాఠీ బ్యాండ్ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆగమన్ మరింత వైభవంగా సాగింది. ఈసారి రెండు రోజుల ముందుగానే భక్తులకు దర్శనం కల్పించిన ఖైరతాబాద్ మహా గణపతి, 71వ ఏట 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మహాద్భుతంగా అలంకరించబడ్డాడు.
Dane van Niekerk: రిటైర్మెంట్‌పై స్టార్ క్రికెటర్ యూటర్న్.. బోర్డుకు క్షమాపణలు, ప్రపంచకప్‌లో చోటు!
గణపయ్యను దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ప్రతీ ఏటా ప్రత్యేక శిల్పకళతో, విశిష్టతతో అలరించే ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి కూడా వైభవోపేతంగా దర్శనమిస్తున్నాడు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు చేరుకుని, మహా గణనాథుడి ఆశీర్వాదం పొందేందుకు ఉత్సాహంగా క్యూలైన్లలో నిలుస్తున్నారు. ఖైరతాబాద్ గణపయ్య దర్శనం ప్రారంభం కావడంతో వినాయక చవితి ఉత్సవాల సందడి అధికారికంగా మొదలైనట్టే.
Dane van Niekerk: రిటైర్మెంట్‌పై స్టార్ క్రికెటర్ యూటర్న్.. బోర్డుకు క్షమాపణలు, ప్రపంచకప్‌లో చోటు!