Site icon NTV Telugu

Kishan Reddy: కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మోడీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలను కలవడం మా ఎజెండా అన్నారు. నేడు నడ్డా పర్యటన ఉంది.. రోడ్ షోలో పాల్గొంటారు.. రాత్రి ముఖ్యనేతలతో సమావేశం ఉందన్నారు. రేపు అందోల్ లో ప్రధాని మోడీ సభ ఉందన్నారు. 1న అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు.. రోడ్ షో లో పాల్గొంటారని తెలిపారు. మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నారు.

Read also: Smriti irani: బెంగాల్‌లో బీజేపీ నేతపై దాడి.. టీఎంసీపై కేంద్రమంత్రి ఆగ్రహం

మా అజెండాలో లేని అంశాలను కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అబద్ధాలను చూసి వీళ్లకు సిగ్గులేదా అని నవ్వుకుంటున్నారు ప్రజలని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఏం చెప్తామో.. చెప్పిందే చేస్తామన్నారు. ఆర్థిక, సామాజిక తారతమ్యాలు లేకుండా రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ భావిస్తుందన్నారు. కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎంఐఎం సంక నాకుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్, కేసీఆర్ కలిసి ఓవైసీ ది చెరో సంక నాకుతారని అన్నారు.
Kakarla Suresh: ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తా..!

Exit mobile version