Site icon NTV Telugu

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ

చాలా రోజుల తర్వాత ప్రభుత్వ పథకాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వివిధ ప‌థ‌కాల అమ‌లు, వ్యవసాయంతో పాటు పాటు ద‌ళిత బంధు పథకం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. వ‌రికి ప్రత్యామ్నాయ పంట‌ల సాగు పై కూడా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఈ రోజు స‌మావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు కూడ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ స‌మావేశం హైద‌రాబాద్ లోని ప్రగతి భ‌వ‌న్‌లో జరగనుంది.

ముఖ్యంగా ద‌ళిత బంధు పై సుదీర్ఘంగా చ‌ర్చించే అవ‌కాశం ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా పైల‌ట్ ప్రాజెక్టుగా చింత‌కాని, తిరుమ‌ల‌గిరి, చార‌కొండ, నిజాం సాగ‌ర్ మండ‌లాల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. అలాగే యాదాద్రి జిల్లా లోని వాసాల‌మ‌ర్రి లో ప‌లువురికి పంపిణీ కూడా జ‌రిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాల్లో దళిత బంధు అమలు చేస్తానని ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాలో ద‌ళిత బందు అమ‌లు చేస్తాన‌ని సీఎం కేసీఆర్ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యం లో జిల్లా క‌లెక్టర్లకు దళిత బంధుపై పలు సూచనలు చేయనున్నారు.

Exit mobile version