KCR: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో స్టార్ ప్లానర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్ షోలో ఆయన ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్నారు. అయితే నిన్న జరిగిన కేసీఆర్ బస్సు యాత్రలో పోలీసుల వైఫల్యం చెందారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్రలో వేల మంది హాజరు కావడంతో జేబు దొంగలు దొరికింది దోచుకుంటున్నారు. ఇదే సమయంగా భావించి పోలీసులు వున్నా ఖాతరు చేయకుండా చేతివాటం చూపిస్తున్నారు. కేసీఆర్ తోపాటు బస్సు యాత్రలో పాల్గొన్న లీడర్లకే ఏకంగా టార్కెట్ చేశారు.
Read also: CM YS Jagan: మోసాలతో యుద్ధం చేస్తున్నాం.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలవాలి
నిజాం పెట్ డిప్యూటీ మేయర్ సోదరుడి మెడలో 3తులాల గొలుసు మాయం చేశారు. అంతేకాకుండా.. దుండిగల్ స్థానికుడు కృష్ణ అనే వ్యక్తి మెడలో 2తులాల గొలుసు, దుందిగల్ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి సోదరుడి వద్ద రూ.50 వేలు.. బౌరాం పెట్ కౌన్సిలర్ భర్త మురళీ యాదవ్ వద్ద గల 50వేల నగదు చోరీ చేశారు. దుండీగల్ నివాసి జగన్ నాయక్ అనే వ్యక్తి జేబులో నుండి కేటుగాళ్లు పర్సు మాయం చేశారు. దీంతో ప్రజలు గుంపులుగా వున్నారనే భావించిన అధికారులు తరువాత చూసుకుంటే కొందరివి మొడలో గొలుసులు, మరి కొందరివి డబ్బులు, పర్సులు మాయమయ్యాయి. దీంతో పోలీసులు భద్ర వైఫల్యం చెందారని మండిపడ్డారు. పోలీసులు అలర్ట్ గా ఉంటే ఈ దొంగతనాలు జరిగేవి కావంటూ ఆరోపించారు.
Aparichitudu : విక్రమ్ ‘అపరిచితుడు’ రీరిలీజ్ డేట్ ఫిక్స్…